అరబ్ దేశమైన జోర్డాన్, ఇరాన్‌కు షాక్ ఇచ్చింది. ఆ దేశ డ్రోన్లు కూల్చివేతలో ఇజ్రాయెల్‌కు సహకరించింది. దీంతో జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా నిర్ణయంపై ముస్లింలు మండిపడుతున్నారు. అంతా ఊహించినట్లుగానే సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే ఇరాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ సమర్థంగా ఎదుర్కొంది. బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ద్వారా వాటిని కూల్చివేసింది.
కాగా, పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన జోర్డాన్ అనూహ్యంగా ఆ దేశానికి మద్దతు ఇచ్చింది. తమ భూభాగం మీదుగా ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే డ్రోన్లను జోర్డాన్ ఆర్మీ కూల్చివేసింది. ఇరాన్‌కు షాక్ ఇచ్చిన జోర్డాన్ చర్య అరబ్ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో జోర్డాన్ తీరుపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు.