వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకత్వం. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ జీవితం అంటేనే రిస్క్. మనసుకు నచ్చిన పనులను చేస్తూ ముందుకుపోవాల్సిందే. ఈ ప్రయాణంలో జయాపజయాలను ఎవరూ అంచనా వేయ లేరు. శబరి ఓ విభిన్నమైన కథ. తాను గతంలో ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదని చెప్పింది. తప్ప కుండా అందరికి నచ్చుతుంది అని చెప్పింది. ఈ కథ వినగానే బాగా నచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఓ సాధార ణ యువతి తన భర్తతో వచ్చిన విభేదాల వల్ల అతని నుంచి విడిపోతుంది. తన కుమార్తెను ఒంటరిగా పెంచు తుంది. కూతురికి మంచి జీవితాన్ని అందించాలని ప్రయత్నించే క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు? వాటిని ఎలా అధిగమించిందన్నదే ఈ సినిమా కథ అని చెప్పింది.
తల్లి పాత్రను పోషించడం గురించి మాట్లాడుతూ తమిళంలో పొడా పొడి, పందెం కోడి-2 చిత్రాల్లో తల్లి పాత్రలు చేశాను. నేను నటనను ప్రేమిస్తాను. ఇమేజ్ పట్టింపులు లేకుండా ప్రేక్షకులను మెప్పించే పాత్రలు చేయాల న్నదే నా లక్ష్యం అని పేర్కొంది. ఈ సినిమాలో తాను యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తానని, అవి సినిమాకు హైలై ట్‌గా నిలుస్తాయని, మదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని ఆమె తెలిపిం ది. పెళ్లి గురించి మట్లాడుతూ ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం మీ అందరికి తెలుసు. ఈ ఏడాది పెళ్లి వేడుక ఉంటుంది అని వెల్లడించింది. ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది.