మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఆరంభం. అజయ్ నాగ్ దర్శకుడు. అభిషేక్ వీటీ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కన్నడ నవల ఆధారంగా ఈ కథ తయారుచేసుకున్నానని, జైలు నుంచి తప్పించుకున్న ఇద్దరు ఖైదీలను పట్టుకు నేందుకు ఇద్దరు డిటెక్టివ్‌లు రంగంలోకి దిగుతారని, వారికి దొరికిన ఓ డైరీ చుట్టూ కథ నడుస్తుందని దర్శకు డు అజయ్ నాగ్ తెలిపారు. తన క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని హీరో మోహన్ భగత్ తెలిపారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాత అభిషేక్ వీటీ తెలిపారు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: దేవ్‌దీప్ గాంధీ, సంగీతం: సింజిత్ యెర్రమిల్లి, దర్శకత్వం: అజయ్‌నాగ్ వీ.