థీమ్ పార్క్‌లో ఐదేండ్ల బాలుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురైన ఉదంతంలో నిర్లక్ష్యం వహించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటన్‌లోని లెగోల్యాండ్ విండ్సర్ రిసార్ట్‌లో ఈ ఘటన జరగ్గా ఎసెక్స్‌కు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన బాలుడు ప్రస్తుతం స్ధానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతడి పరిస్ధితి ఇంకా విషమంగానే ఉందని తెలిసింది. మహిళ నిర్లక్ష్యంతోనే బాలుడు అకారణంగా గాయపడ్డాడనే ఆరోపణలపై మహిళ (27)ను అరెస్ట్ చేసి జులై 26 వరకూ బెయిల్‌పై విడుదల చేశారు.
. ఈ దురదృష్టకరఘటన జరిగిన వెంటనే బాలుడి తల్లితండ్రులను తాము సంప్రదించామని, వారికి ఈ సంక్లిష్ట సమయంలో తోడుగా ఉన్నామని థేమ్స్ వ్యాలీ చైల్డ్ అబ్యూజ్ దర్యాప్తు విభాగానికి చెందిన జో ఎలె తెలిపారు. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో రిసార్ట్‌లో ఉన్న వారితో తమ బృందం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.