Skip to main content

Namaste NRI

సాయి పల్లవి బర్త్ డే స్పెషల్..తండేల్‌ నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్‌  

సాయిపల్లవి కథల ఎంపికలో చాలా చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కెరీర్‌ ఆరంభం నుంచి ప్రతీ చిత్రంలో తనదైన మార్క్‌ చూపిస్తూ విలక్షణ నాయికగా గుర్తింపును తెచ్చుకుందీ. నేడు సాయిపల్లవి జన్మదినం. ఈ సందర్భంగా నాగచైతన్యతో కలిసి ఆమె నటిస్తున్న తండేల్‌ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సాయిపల్లవి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది.

గ్రామీణ నేపథ్యంలో దేశభక్తి ప్రధాన అంశాలతో దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య జాలరి రాజు పాత్రలో నటిస్తుండగా, సాయిపల్లవి ఆయన భార్య బుజ్జమ్మగా కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల్లో పాకిస్తాన్‌ సైన్యం చేతిలో బందీ కాబడ్డ భారత జాలరులు అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు? దేశభక్తిని గుండెల్లో నింపుకున్న ఆ మత్స్యకారుల బృందం చేసిన సాహసాలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. నేడు సాయిపల్లవికి చెందిన స్పెషల్‌ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌, సమర్పణ: అల్లు అరవింద్‌, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.

Social Share Spread Message

Latest News