అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయాడు. తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రూపేశ్ ప్రస్తుతం షికాగోలోని విస్కాన్సిన్‌లో ఉన్న కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.భారత్‌కు చెందిన రూపేశ్ మే 2వ తేదీ నుంచి కన్పించడంలేదని తెలిసి కాన్సులేట్ ఆందోళన చెందుతున్నది. అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే అతని జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామని షికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
ఉన్నత విద్యకోసం వెళ్లిన తమ కుమారుడి జాడ తెలియకపోవడంతో అతని తల్లిదండ్రులు ఆందోళనకు గురవతున్నారు. రూపేశ్ ఆచూకీ కనుక్కోవాలంటూ భారత విదేశాంగ మత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని అభ్యర్థించారు. కాగా, రూపేశ్ గురించి తెలిస్తే తమకు సమాచార అందించాలంటూ పోలీసులు స్థానికులను కోరారు.
కాగా, ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసకుంటున్న విషయం తెలిసిందే. దాడులు, కిడ్నాప్‌ల వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ, భారత సంతతి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.