టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల వెనకున్న మాస్టర్ మైండ్ ఎలన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లడంపై కసరత్తు వేగవంతం చేశారు. తన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కోసం 2025 నాటికి సూపర్‌కంప్యూటర్‌ను క్రియేట్ చేయాలని మస్క్ యోచిస్తున్నారు. సూపర్‌కంప్యూటర్ ఆవిష్కరణ దిశగా కార్యాచరణతో ముందుకెళతామని ఎలన్ మస్ఖ్ ఇటీవల ఇన్వెస్టర్లతో వెల్లడించారు. ఈ అడ్వాన్స్‌డ్ మెషీన్ 2025 నాటికి పనిచేసేలా సూపర్‌కంప్యూటర్ తయారీ ప్రణాళికలతో మస్క్ ముందుకెళుతున్నారు.
భవిష్యత్ ఏఐ మోడల్స్ కోసం జీపీయూ వాడకాన్ని విస్తృతం చేసేందుకు మస్క్ ప్రణాళికలు రూపొందించారు. ఈ సూపర్‌కంప్యూటర్ ఒరాకిల్ భాగస్వామ్యంతో ఎన్‌విదియా హెచ్100 జీపీయూలను వినియోగిస్తుంది. ఈ భారీ సూపర్‌కంప్యూటర్‌ను డెవలప్ చేయడంలో సాయపడేందుకు ఒరాకిల్‌తో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తు న్నా మని మస్క్ సంకేతాలు పంపారు.