కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భారతీయుడు-2. 1996లో సంచలనం సృష్టించిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. జూన్ 1న చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. రెండో సింగిల్ చెంగల్వ చేయందేనా అనే పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని అబ్బి, శృతికా సముద్రాల ఆలపించారు. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్‌లపై చిత్రీకరించిన ఈ పాట చక్కటి మెలోడీగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ సీక్వెల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో కమల్‌హాసన్ కనిపించనున్నారు. ఎస్.జె.సూర్య, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్, జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జులై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: రవివర్మన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ప్రసాద్. నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ప్రొడక్షన్స్.