Namaste NRI

52 ఏళ్ల వ‌య‌సులో 11వ బిడ్డకు తండ్ర‌యిన మ‌స్క్

ప్ర‌పంచ కుబేరుడే అయినా  ఎలాన్ మ‌స్క్‌ ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎక్క‌డ వివాదం ఉంటే, అక్కడ మ‌స్క్ ఉంటాడు.  ఇద‌లావుంటే..  ఈయ‌నకు ఇప్పుడు 52 సంవ‌త్స‌రాల వయ‌సు. ఈ వ‌య‌సు లో ఆయ‌న తండ్రి అయ్యారు. మస్క్ భార్య షివాన్ జిలీస్ మూడవ బిడ్డకు జన్మనిచ్చారు. మస్క్ స్థాపించిన న్యూరాలింక్‌లో ఆపరేషన్స్, స్పెషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా జిలీస్ వ్యవహరిస్తున్నారు. ఈ దంపతులకు 2021లో కవలలు జన్మించారు. ఎలాన్ మస్క్ మొదటి భార్య జస్టిస్ మస్క్‌కు ఐదుగురు సంతానం కాగా రెండవ భార్య కెనడా సంగీత కళాకారిణి గ్రైమ్స్‌కు ముగ్గురు పల్లిలు. మూడవ భార్య జిలీస్ ద్వారా మస్క్‌కు ముగ్గురు పిల్లలు జన్మించారు.

దీంతో మొత్తం 11 మంది సంతానానికి ఎలాన్ మస్క్ తండ్రయ్యారు. 2022 ముందు వరకు మస్క్, జిలీస్ మధ్య సంబంధం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే తమ కవల పిల్ల పేర్లను మార్చడానికి పెట్టుకున్న దరఖాస్తుతో ఈ విషయం బయటపడింది.మస్క్ ఆత్మకథ రాస్తున్న వాల్టర్ జాక్సన్ 2023 సెప్టెంబర్‌లో మస్క్, జిలీస్ మధ్య అనుబంధాన్ని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events