ప్రియదర్శి, నభానటేశ్ జంటగా నటిస్తున్న చిత్రం డార్లింగ్. ఈ చిత్రానికి అశ్విన్‌రామ్ దర్శకుడు. జూలై 19న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన వస్తున్నది. నేటి జనరేషన్‌కి కనెక్టయ్యే కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారని, తమ సంస్థలో మరో బ్లాక్‌బాస్టర్‌గా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: నరేశ్ రామదురై, మాటలు: హేమంత్, సంగీతం: వివేక్ సాగర్.