Namaste NRI

చరిత్ర సృష్టించిన వైద్య విద్యార్థి… ప్రపంచం లోనే మొదటిసారి

ఇంగ్లండ్‌లోని  ఒక పాఠశాల విద్యార్థి వైద్య చరిత్ర సృష్టించాడు. తీవ్ర మూర్ఛ రోగంతో బాధ పడుతున్న బాలునికి మూర్ఛ నియంత్రణకు అతని పుర్రె లోపల ఒక కొత్త పరికరాన్ని అమర్చినట్లు, ఇలా చేయడం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిసింది. బాలుడు ఓరాన్ నోల్సన్ మెదడు లోపలికి విద్యుత్ సంకేతాలు పంపే న్యూరోస్టిమ్యులేటర్ వల్ల అతనికి పగటి పూట మూర్ఛలు 80 శాతం మేర తగ్గాయి. ఓరాన్‌కు మూడు సంవత్సరాల వయస్సులో చికిత్సకు లొంగని తరహా మూర్ఛ లెనాక్స్ గస్టౌట్ సిండ్రోమ్ కు గురయ్యాడు.

అప్పటి నుంచి అతను రెండు డజన్ల నుంచి వందల సంఖ్యలో రోజూ పలు మార్లు మూర్ఛపోతుండేవాడని తెలిసింది. సుమారు ఎనిమిది గంటలు పట్టిన ఆ శస్త్రచికిత్స 2023 అక్టోబర్‌లో జరిగింది. ఓరాన్ 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు లండన్‌లోని గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ ఆసుపత్రిలో ఒక ట్రయల్‌లో భాగంగా ఆ చికిత్స జరిగింది. అతనికి ఇప్పుడు 13 ఏళ్లు. యూనివర్శిటీ కాలేజ్ లండన్, కింగ్స్ కాలేజ్ ఆసుపత్రి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యంలో ఒక ట్రయల్‌లో భాగం ఆ సర్జరీ. ఓరాన్ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాడని, అతని జీవిత ప్రమాణం మెరుగైందని అతని తల్లి జస్టిన్ వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events