Namaste NRI

రాజ్‌ తరుణ్‌ తిరగబడరసామీ నుంచి.. రాధాభాయ్ సాంగ్ రిలీజ్              

రాజ్‌ తరుణ్‌, మాల్వి మల్హోత్రా జంటగా రూపొందుతోన్న చిత్రం తిరగబడరసామీ. ఎ.ఎస్‌.రవికుమార్‌చౌదరి దర్శకుడు. మల్కాపురం శివకుమార్‌ నిర్మాత. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు.  ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది.

 ప్రమోషన్‌లో భాగంగా ఇందులోని లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో విభిన్నమైన పాత్ర పోషిస్తున్న మన్నారా చోప్రాపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక గీతం యువతరాన్ని ఆకట్టుకునేలా ఉంటుంద ని మేకర్స్‌ చెబుతున్నారు. బాయ్‌ బాయ్‌.. రాధాభాయ్‌.. చెప్తాంటే హాయ్‌ హాయ్‌.. అవుతాందే మనసంతా గాయ్‌ గాయ్‌ అంటూ సాగే ఈ గీతాన్ని భోలే షావలి స్వయంగా రాసి, స్వరపరచగా, శ్రావణభార్గవి హైలీ ఎనర్జిటిక్‌గా ఆలపించారని, మన్నార్‌చోప్రా మాస్‌ డాన్స్‌ మూమెంట్స్‌ విశేషంగా ఆకట్టుకుంటాయని మేకర్స్‌ తెలిపారు. ఈచిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి ఎం.ఎన్‌, నిర్మాణం: సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events