ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ డార్లింగ్. అశ్విన్‌రామ్ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మాతలు. విడుదలకు ముందు ఎంటర్‌టైనింగ్ ప్రొమోలతో పాజిటీవ్ ఇంప్రెషన్‌ని ఈ సినిమా సొంతం చేసుకున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగల్‌ని మేకర్స్ విడుదల చేశారు.
చేరాలమ్మా.. తారా తీరాలే.. కరిగిపోవా దూరాలే.. రాహి రే.. రాహి రే అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, వివేక్ సాగర్ స్వరపరిచారు. కపిల్ కపిలన్ ఆలపించారు. నభా నటేశ్‌పై చిత్రీకరించిన ఈ పాట దేశంలోని వివిధ అందమైన ప్రదేశాలను ఆవిష్కరింపజేస్తూ, జ్ఞాపకాల అనుభూతుల్ని పంచేలా సాగింది. బ్రహ్మాందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: హేమంత్, కెమెరా: నరేశ్ రామదురై, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్.