Skip to main content

Namaste NRI

డార్లింగ్‌ సెకండ్‌ సింగల్‌ విడుదల

ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నటిస్తున్న యూనిక్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ డార్లింగ్‌. అశ్విన్‌రామ్‌ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మాతలు. విడుదలకు ముందు ఎంటర్‌టైనింగ్‌ ప్రొమోలతో పాజిటీవ్‌ ఇంప్రెషన్‌ని ఈ సినిమా సొంతం చేసుకున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్‌ సింగల్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

చేరాలమ్మా.. తారా తీరాలే.. కరిగిపోవా దూరాలే.. రాహి రే.. రాహి రే  అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాయగా, వివేక్‌ సాగర్‌ స్వరపరిచారు. కపిల్‌ కపిలన్‌ ఆలపించారు. నభా నటేశ్‌పై చిత్రీకరించిన ఈ పాట దేశంలోని వివిధ అందమైన ప్రదేశాలను ఆవిష్కరింపజేస్తూ, జ్ఞాపకాల అనుభూతుల్ని పంచేలా సాగింది. బ్రహ్మాందం, విష్ణు, కృష్ణతేజ్‌, అనన్య నాగళ్ల, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: హేమంత్‌, కెమెరా: నరేశ్‌ రామదురై, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events