ప్రముఖ సినీనటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మావతి క్యాన్సర్‌తో పోరాడుతూ హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వాములయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. భార్మ ఆకస్మిక మరణంతో ఉత్తజ్ సహా ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలిపించారు. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి బసవతారకం ఆస్పత్రికి చేరుకొని ఉత్తేజ్ కుమార్తెలను ఓదార్చారు. చిరంజీవి రాకతో ఉత్తేజ్ తన భార్యను తలుచుకుంటూ గుండెలవిసేలా రోధించారు. జీవిత రాజశేఖర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజి, ఏడిద శ్రీరామ్ సహా పలువురు నటీనటులు ఉత్తేజ్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రముఖ గేయ రచయిత, ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ్, పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరై నివాళులర్పించారు.