ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చే వారం ఆయన రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యంలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దీంతో పాటు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడిరచింది. సెప్టెంబరు 24న వాషింగ్టన్‌లో మోదీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మధ్య క్వాడ్ సదస్సు జరగనుందని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత సెప్టెంబరు 25న న్యూయార్క్ వేదికగా ఐరాస సర్వసభ్య సమావేశం 76వ సెషన్‌లో జరిగే జనరల్ డిబేట్‌లో ప్రధాని పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలిపింది