Namaste NRI

సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ ఖరారు

నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం సరిపోదా శనివారం. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 13న విడుదల చేయబోతు న్నారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ఇది. నాని పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. శనివారం మాత్రమే ప్రత్యర్థుల పనిపట్టే సూర్య అనే యువకుడిగా ఆయన పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది. యాక్షన్‌ ఘట్టాలు రోమాంచితం గా ఉంటాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. నాని కెరీర్‌లో ఓ వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది అని మేకర్స్‌ తెలిపారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ఎస్‌.జే.సూర్య తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, రచన-దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ.

Social Share Spread Message

Latest News