Namaste NRI

45 ఏళ్ల తర్వాత ఆ దేశానికి… బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్ బయలుదేరారు. ఇరుదేశాల మధ్య సంబం ధాలు మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో వివిధ కీలక అంశాలలో భాగస్వామ్యం, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాలపై పోలాండ్ అధ్యక్షు డితో మోదీ చర్చించనున్నారని తెలిపింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత విద్యార్థులకు పోలాండ్ సాయం చేసింది. ఉక్రెయిన్ నుంచి సుమారు 4 వేల మంది భారత విద్యార్థులు పోలాండ్ లోకి అడుగుపెట్టి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 6 వేల మంది పోలిష్ మహిళలు, చిన్నారులకు భారత భూభాగంలో ఆశ్రయం కల్పించారు.

ఈ పర్యటనతో ప్రధాని మరో రికార్డును సృష్టించారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. చివరిసారి 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ భారత ప్రధానులు ఎవరూ కూడా ఆ దేశానికి వెళ్లలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress