Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు … ఫ్రాన్స్‌ను!

ఫ్రాన్స్ లో జరుగుతున్న విద్యార్థి ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. ఈ నిరసనలకు అదుపుతప్పిన వలసలే కారణమని, దేశాన్ని (ఫ్రాన్స్) ఇస్లాం తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నమే ఇదని ఆరోపించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్నది అదుపులేని సామూహిక వలసల ఫలితమే తప్ప మరొకటి కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నిర‌స‌న‌లు పాఠశాలల గురించి కాదని అన్నారు. ఒకప్పుడు గొప్ప దేశంగా ఉన్న ఫ్రాన్స్‌ను ఇస్లాం స్వాధీనం చేసుకోవాలనుకుంటోంద‌ని పేర్కొన్నారు.

అయితే ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసనలకు, ట్రంప్ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతున్న‌ది. విద్యావ్యవస్థలో నెలకొన్న లోపాలు, నిధుల కొరత, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఫ్రాన్స్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events