Skip to main content

Namaste NRI

మిస్టరీ థ్రిల్లర్ చూస్తున్నంత ఎక్సైటింగ్‌గా ఉంటుంది.. ది ట్రెయిటర్స్‌ : సూపర్ హీరో తేజ సజ్జ

ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన రియాలిటీ షో ది ట్రెయిటర్స్‌ తెలుగులో రాబోతున్నది. ఈ షోకు యువ హీరో తేజ సజ్జ ప్రయోక్తగా వ్యహరించనున్నారు. మొత్తం పది ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్‌ ఈ నెల 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్‌తో ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరో తేజ సజ్జ విలేకరులతో మట్లాడారు. మిరాయ్‌ సినిమా తర్వాత ప్రైమ్‌ వీడియో తనను సంప్రదించగా ఫార్మాట్‌పై నమ్మకంతో వెంటనే అంగీకరించానన్నారు. ఈ షో మర్డరీ మిస్టరీ థ్రిల్లర్‌ను చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.

ఇప్పటివరకు వచ్చిన తెలుగు రియాలిటీ షోలకు భిన్నంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఎవరు ట్రెయిటర్స్‌? ఎవరు అమాయకులు? అనే ఉత్కంఠతో సాగుతుంది. ఇందులో 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటారు. వారి ఎంపికలో ఆడే సామర్థ్యం, నమ్మించడం, వ్యూహాలు పన్నడం వంటి లక్షణాలకు ప్రాధాన్యం ఇచ్చాం. 11 రోజుల్లో 10 ఎపిసోడ్ల షూటింగ్‌ పూర్తయింది, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్‌ చేసే షో ఇది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events