Skip to main content

Namaste NRI

అమెరికాలో విషాదకర ఘటన… ముగ్గురు తెలుగువారు మృతి

అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. టెక్సస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. మరో వ్యక్తి చెన్నైవాసి అని తెలిసింది. రోడ్డుపై వెళ్తున్న 5 వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మృతుల పేర్లు రఘునాథ్, లోకేష్, ఫరూక్ షేక్, కాగా చెన్నై వాసి పేరు దర్శిని వాసుదేవన్‌ అని నిర్ధారణ అయ్యింది. తెలుగు మృతుల్లో ఒకరు కుకట్‌పల్లి వాసి ఉన్నట్టు సమాచారం. టెక్సాస్ రాష్ట్రంలోని అన్నెలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాధితులు కారులో బెంటన్‌విల్లే వైపు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టిం ది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు ఒకేసారి ఢీకొట్టుకున్నాయి. దీంతో ఘోర ప్రమాదానికి దారి తీసింది. మంటలు కూడా చెలరేగాయాయి. యూఎస్ 75వ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రయాణించిన కారు మంటల్లోకి దూసుకెళ్లిందని, బాధితులు లోపల చిక్కుకున్నారని తెలిసింది. మృతుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు తమవారి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు తల్లిడిల్లిపోతున్నారు. ఇక మృతదేహాలను భారత్‌కు తరలించాలని బాధిత కుటుంబాలు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events