రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్‌ఛేంజర్. డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2024 క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు గతంలోనే ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ అయితే చేశారు కానీ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక్క అప్‌డేట్ లేదు. అయితే సినిమా అప్‌డేట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్‌కు ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి వినాయక చవితి పండుగ కానుకగా సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ మూవీ నుంచి రెండో పాటను సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రకటించింది.

ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా, సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.















