Skip to main content

Namaste NRI

సంక్రాంతికి రాబోతున్న మజాకా

దర్శకుడు త్రినాథరావు నక్కిన, సందీప్‌కిషన్‌తో మజాకా చేస్తున్నారు. రాజేష్‌ దండా నిర్మాత. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా టైటిల్‌, రిలీజ్‌ టైమ్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సందీప్‌కిషన్‌ పర్‌ఫెక్ట్‌ సంక్రాంతి చిన్నోడిగా కనిపించారు. సంప్రదాయ పంచె కట్టు, చొక్కా ధరించి, భుజంపై పెద్ద టేప్‌రికార్డర్‌తో కూర్చీపై కూర్చొని ఎంటైర్టెన్మెంట్‌ మోడ్‌లో కనిపిస్తున్నా రు. రావు రమేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ, కెమెరా: నిజార్‌ షఫీ, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, సహనిర్మాత: బాలాజీ గుత్తా, నిర్మాణం: ఏకే ఎంటైర్టెన్మెంట్స్‌, హాస్య మూవీస్‌, జీ స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News