Skip to main content

Namaste NRI

అమరన్ లో ఇందు రెబెకా వర్గీస్‌గా సాయిపల్లవి

శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం అమరన్‌. సాయిపల్లవి కథానాయికగా.  రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకుడు. శివ్‌ అరూర్‌, రాహుల్‌ సింగ్‌ రాసిన ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ అనే పుస్తకంలోని మేజర్‌ వరదరాజన్‌ అధ్యాయం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేజర్‌ వరదరాజన్‌ పాత్రను శివకార్తికేయన్‌ పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఇందు రెబెకా వర్గీస్‌గా సాయిపల్లవిని పరిచయం చేస్తూ ఇంట్రో వీడియోను విడుదల చేశారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌తో మొదలైన ఈ ఇంట్రో వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో సాయిపల్లవి తనదైన నటనతో కట్టిపడేసింది. సాయిపల్లవి, శివకార్తికేయన్‌ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. దేశభక్తి, సాహసం ప్రధానంగా ఈ సినిమా స్ఫూర్తివంతంగా సాగుతుందని, దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖిత రెడ్డి తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News