Skip to main content

Namaste NRI

వెయ్యి మంది ఆర్టిస్టులతో తండేల్ లో శివరాత్రి సాంగ్ షూట్

శ్రీకాకుళం జిల్లా డి.మత్యలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ప్రతిష్టా త్మక చిత్రం తండేల్‌. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీకి చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళంలో దక్షిణకాశీగా పేరు గాంచిన శైవక్షేత్రం శ్రీముఖలింగం. అక్కడ వైభవంగా జరిగే శివరాత్రి మహోత్సవాలను స్పూర్తిగా తీసుకొని అద్భుతమైన శివరాత్రి పాటను ఈ సినిమా కోసం చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్‌ టైమ్‌లెస్‌ క్లాసిక్‌గా ఈ పాటను కంపోజ్‌ చేశారని, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో వేలాదిమంది డ్యాన్సర్స్‌తో కలిసి నాగ చైతన్య, సాయిపల్లవి ఈ పాటకోసం చేసిన డ్యాన్స్‌ కొన్నేళ్లపాటు గుర్తుండిపోతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ సాంగ్‌ షూట్‌ నుంచి రెండు పోస్టర్లను మేకర్స్‌ విడుదల చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి సంప్రదాయ దుస్తులతో ఈ పోస్టర్లో కనిపించారు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సమర్పణ: అల్లు అరవింద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events