ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మహీష. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో ప్రవీణ్ కె.వి. మాట్లాడుతూ మహీష సినిమాను మా టీమ్ అంతా ఎంతో కష్టపడి రూపొందించాం. సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. మంచి సినిమా చేశారంటూ సెన్సార్ వాళ్లు అభినందించారు. చిన్న సినిమాలు ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడం కష్టం. మీ మీడియా సపోర్ట్ ఉంటేనే అది సాధ్యం. రీసెంట్ గా రిలీజ్ చేసిన మా మూవీ టీజర్ కు దాదాపు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది పెద్ద నెంబర్ కాకపోవచ్చు కానీ మా మహీష సినిమా టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని చెప్పేందుకు ఈ వ్యూస్ నిదర్శనం. మా సినిమాలో విలన్ గా చేసిన విజయ్ రాజ్ గారికి మంచి పేరొస్తుంది. మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నాం. త్వరలోనే మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తాం. మహీష సినిమాలో మంచి మేసేజ్ తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ప్రేక్షకులు మా మహీష మూవీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామన్నారు.