హీరో కార్తీ, అరవిందస్వామి లీడ్ రోల్స్ చేసిన చిత్రం సత్యం సుందరం. ప్రేమ్‌కుమార్ దర్శకత్వం. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గత నెల 28న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబ డుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి, కమల్‌హాసన్ లాంటి గొప్పవారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడే ఈ తరహా సినిమాలను మనకు వారు చూపించేశారు. ఈ కైండ్ ఆఫ్ సినిమాను మన లోపల పెట్టారు. ఇలాంటి ఎమోషన్స్‌ని మిస్ అవుతున్నామని, మళ్లీ ఆ ఎమోషన్స్‌ని తీసుకొచ్చారని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. షరతులు లేని ప్రేమను తెరపై ఆవిష్కరించిన డైరెక్టర్ ప్రేమ్‌కుమార్‌ని అభినందించకుండా ఉండలేకపోతున్నా అని అన్నారు. ఇంకా దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్, హీరోయిన్ శ్రీదివ్య, రచయిత రాకేందుమౌళి కూడా మాట్లాడారు.