Namaste NRI

అధ్యక్ష ఎన్నికల వేళ.. వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఊహించని షాక్‌!

అగ్రరాజ్యం అమెరికాలో మరో వారంలో  అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలోకి దిగారు. ఇరువురూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల వేళ యూఎస్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ కు ఊహించని షాక్‌ తగిలింది.

అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని వాషింగ్టన్‌ పోస్ట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వాషింగ్టన్‌ పోస్ట్‌ దాదాపు 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు వాషింగ్టన్‌ పోస్ట్‌ నిర్ణయాన్ని పత్రిక యజమాని, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌  సమర్థించారు. అధ్యక్ష ఎన్నికల్లో క్రిడ్‌ ప్రోకోకు  తావు లేదన్నారు. విశ్వసనీయత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events