ఆర్మీ మేజర్ వరదరాజన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. అగ్ర నటుడు కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మించారు. ఇటీవలే విడుదలైంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం తన మిత్రుడు కమల్ హాసన్‌కు ఫోన్ చేసి అభినందించారు. దేశభక్తి నేపథ్యంలో స్ఫూర్తివంతమైన చిత్రాన్ని తీశారని రజనీకాంత్ ప్రశంసించారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నదని నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
