Namaste NRI

ధూం ధాంగా హెబ్బా పటేల్ కొత్త సినిమా ట్రైలర్‌

చేతన్‌కృష్ణ, హెబ్బాపటేల్‌ జంటగా నటించిన చిత్రం ధూం ధాం. సాయికిషోర్‌ మచ్చా దర్శకుడు. ఎంఎస్‌ రామ్‌కుమార్‌ నిర్మాత. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఆద్యంతం అద్భుతమైన కామెడీతో సినిమా తీశారని ఆయన ప్రశంసించారు. చక్కటి వినోదంతో పాటు తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ట్రైలర్‌ మెప్పించింది. గోపీసుందర్‌ బాణీలు అలరించాయి. ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: గోపీసుందర్‌, కథ, స్క్రీన్‌ప్లే: గోపీమోహన్‌, దర్శకత్వం: సాయికిషోర్‌ మచ్చా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events