Skip to main content

Namaste NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. డొనాల్డ్ ట్రంప్‌ విజయదుందుభి

అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. మెజార్టీ ఎల‌క్ట్రోర‌ల్ ఓట్లు సాధించిన అనంత‌రం ఫ్లొరిడాలోని తన పామ్ బీచ్ లో ప్రసంగించిన కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్ర‌సంగం చేశారు.

అందరికీ ధన్యవాదాలు అంటూ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికాకు మంచి రోజులు వచ్చాయని, స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ తన విజయాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ ఓట్లతో పాటు పాపులర్ ఓట్లలోనూ తనకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని చెప్పారు. తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతుందని, తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పారు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 270 దాటి 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించి 47వ అధ్య‌క్షుడిగా ఎన్నికైన తనకు మొత్తం 315కు పైగా ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని చెప్పారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఊహించిన దానికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని, అమెరికా ప్రజలు ఇంతటి విజయాన్ని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు అద్భుతంగా పోరాడారని, అదే పోరాట పటిమతో దేశాన్ని మరోమారు అద్భుతంగా తీర్చిదిద్దుకుందామంటూ తన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదం చేశారు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ను ఈ సందర్భంగా ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events