Namaste NRI

రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ సినిమా ప్రారంభం

సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా, సుభాష్‌చంద్ర దర్శకత్వంలో రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌  హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీవిష్ణు క్లాప్‌ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. యువ దర్శకులు శ్రీకాంత్‌ ఓదెల, శౌర్యువ్‌, మహేశ్‌బాబు.పి తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. వీరితోపాటు నిర్మాత సునీల్‌ నారంగ్‌ కూడా పాల్గొన్నారు. అతిథులంతా యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇందులో రెండు ప్రేమకథలుంటాయని, వాటిలో ఒకటి హీరోహీరోయిన్లది కాగా, రెండోది తండ్రీకూతుర్లదని దర్శకుడు చెప్పారు. భీమవరం నేపథ్యంలో సాగే కథ ఇదని సుమంత్‌ ప్రభాస్‌ అన్నారు. నిధి ప్రదీప్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజీవ్‌ కనకాల, హర్షవర్ధన్‌, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్‌, సంగీతం: నాగవంశీకృష్ణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events