Skip to main content

Namaste NRI

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 గంటల వర్క్ వీక్ పై ఇటీవల నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే, తన వ్యాఖ్యల పై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన తనను తాను సమర్థించుకున్నారు. దేశం ముందుకు సాగాలంటే శ్రమించడమే ఏకైక మార్గం అన్నారు.  క్షమించండి నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నేను చచ్చేంతవరకు ఇదే మాట మీద ఉంటాను అంటూ సీఎఎన్‌బీసీ లీడర్షిప్ సమ్మిట్ సందర్భంగా మూర్తి తెలిపారు . 1986లో ఇండియా ఆరు రోజుల వర్క వీక్ నుంచి ఐదు రోజుల వర్క్ వీక్‌కు మారినప్పుడే తానెంతో అసంతృప్తికి గురైనట్టు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే కావలసింది విశ్రాంతి కాదు త్యాగం అన్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీనే వారానికి 100 గంటలు పనిచేస్తున్నారు. ఇందుకు కృతజతగా మనం చేయాల్సిం ది మరింత శ్రమించి పనిచేయడమే అంటూ మోదీ అంశాన్ని ప్రస్తావించారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలు సైతం ఇలాగే ఎంతో కష్టపడి తమ దేశాభివృద్ధికి పాటు పడుతున్నాయన్నారు.

Social Share Spread Message

Latest News