Skip to main content

Namaste NRI

తండేల్‌ నుంచి బుజ్జి తల్లి వచ్చేస్తుంది

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా తండేల్‌. చందూ మొండేటి దర్శక త్వంలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘట నల సమాహారం ఈ సినిమా. షూటింగ్‌ చివరి దశలో ఉంది. మేకర్స్‌ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. అందు లో భాగంగా ఈ సినిమా మ్యూజిక్‌ జర్నీని ప్రారంభించారు. ఈ నెల 21 ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ బుజ్జి తల్లి సాంగ్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. లీడ్‌ పెయిర్‌ నాగచైతన్య, సాయిపల్లవి పాత్రల అనుబంధాన్ని ఆవిష్కృతం చేసేలా ఈ పోస్టర్‌ ఉన్నది. సంగీతానికి మంచి స్కోప్‌ ఉన్న కథతో ఈ సినిమా రూపొందుతున్నదని, దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, ఇద్దరు ప్రేమికుల భావోద్వేగమే ఈ పాట అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌ దత్‌, సమర్పణ: అల్లు అరవింద్‌, నిర్మాణం: గీతాఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News