రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తేదీ ఖరారు కాలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదికోసారి సమావేశంలో కావాలని నేతలు ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందిందన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ భారత్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి కానున్నది. ఈ పర్యటన పుతిన్‌కు ఎంతో కీలకం కానున్నది.