కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడిక్ ఫాంటసీ చిత్రం యూఐ. జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మాతలు. సోమవారం గ్లింప్స్‌ను విడుదల చేశారు. 2040లో కథ జరుగుతున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, యుద్ధం వల్ల సమాజంలో ఓ ఘర్షణాపూరితమైన వాతావర ణం ఏర్పడుతుంది. ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో ఎంట్రీ ఇచ్చిన హీరో ఉపేంద్ర నియంతగా కనిపించారు. ఏమాత్రం జాలి, దయ లేకుండా వ్యవహరిస్తూ ప్రజల్ని తన నియంత్రణలో ఉంచుకునే వ్యక్తిగా ఆయన పాత్ర సాగింది. విజువల్స్, అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. రీష్మా నానయ్య, మురళీశర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య తదితరులు ఈ చిత్రలో నటించారు.