ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్‌కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటూ నరకం చూస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.