Skip to main content

Namaste NRI

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నుంచి శకుంతలక్కయ్యా సాంగ్‌ రిలీజ్

వెన్నెల కిషోర్‌ టైటిల్‌ రోల్‌ని పోషిస్తున్న చిత్రం శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌. రైటర్‌ మోహన్‌ దర్శకుడు. వెన్నెపూస రమణారెడ్డి నిర్మాత. క్రిస్మస్‌ సందర్భంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళ వారం ఈ సినిమా నుంచి శకుంతలక్కయ్యా  అనే పార్టీసాంగ్‌ను విడుదల చేశారు. సునీల్‌కశ్యప్‌ మ్యూజిక్‌ అందించిన ఈ పాట హుషారైన బీట్స్‌తో సాగింది.  కాసర్ల శ్యామ్‌ సాహిత్యాన్నందించిన ఈ పాటను ఊహా నేహా ఆలపించారు. స్నేహ గుప్తా డ్యాన్స్‌ మూమెంట్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో శ్రీకాకుళం డిటెక్టివ్‌ షెర్లాక్‌హోమ్స్‌గా వెన్నెల కిషోర్‌ కనిపిస్తాడని, ఓ కేసును ఛేదించే క్రమంలో ఆయనకు ఎదురైన సంఘటన లేమిటన్నదే కథాంశమని, చక్కటి హాస్యంతో ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్‌, స్నేహ గుప్తా తదితరులు చిత్ర తారాగణం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events