షణ్ముఖ్ జస్వంత్ లీడ్‌రోల్ చేస్తున్న ఫీల్‌గుడ్ ఎంటైర్టెనర్ లీలావినోదం. పవన్ సుంకర దర్శకుడు. శ్రీధర్ మారిసా నిర్మాత. ఈ నెల 19న ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ లీలా వినోదం మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. అందరూ కష్టపడ్డారు. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాం. నన్ను సపోర్ట్ చేయమని అందరినీ కోరుతున్నాను. లీలా వినోదం టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్. డిసెంబర్ 19 నుంచి ఈటీవీ విన్ లో లీలా వినోదం స్ట్రీం అవుతుంది. తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాను. థాంక్యూ అన్నారు. సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు జస్వంత్ కృతజ్ఞతలు తెలిపారు.
ఓవర్ థింకింగ్ అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని, ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యే అంశాలు ఇందులో చాలా ఉంటాయని, అద్భుతమైన ఫీల్ ఉన్న సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. అనగ అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూపలక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం: శ్రీ అక్కియన్ ఆర్ట్స్.