అమెరికాలోని అక్టోబర్ నెల అంతా హిందూ కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించేకొనేందుకు వివిధ హిందూ సంస్థలు సిద్ధమయ్యాయి. అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఓహియో, మసాచుసెట్స్ సహా పలు రాష్ట్రాలు అక్టోబర్ నెల హిందూ వారసత్వ నెలగా ప్రకటించాయి. హిందూ మత ప్రత్యేక చరిత్ర, వారసత్వం అమెరికా అభివృద్ధికి ఎంతో దోహదం చేశాయని ఈ సందర్భంగా పేర్కొన్నాయి. అమెరికా ప్రభుత్వం కూడా అక్టోబర్ నెలను హిందూ వాసరత్వ మాసంగా గుర్తించాలని హిందూ సంస్థలు, సంఘాలు కోరుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, వరల్డ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ అమెరికా, ఉత్తర అమెరికా హిందువుల కూటమి వంటి సంఘాలు హిందూ వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా కార్యక్రమాలు రూపొందించే పనుల్లో నిమగ్నమయ్యాయి.














