Skip to main content

Namaste NRI

సిగ్మా సక్సెస్‌ కావడం ఖాయం :చిరంజీవి

సందీప్‌కిషన్‌ హీరోగా జేసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ అడ్వెంచర్‌ సిగ్మా. ఫరియా అబ్దుల్లా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడారు. ఎవరిమాటా వినని వాడ్ని సిగ్మా అంటారని తెలిసింది. ఇది నిజంగా న్యూ థాట్‌. ట్రైలర్‌ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. సక్సెస్‌ ఖాయం. ఈ వేడుకకు రావడానికి కారణం సందీప్‌కిషన్‌. తను నా కుటుంబసభ్యుల్లో ఒకడు. విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ డైరెక్షన్‌లో సినిమా అనగానే, వాళ్ల తాత ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ గుర్తొచ్చారు. ఆయన దర్శకత్వంలో చట్టానికి కళ్లులేవు, దేవాంతకుడు వంటి మంచి సినిమాలు చేశాను. ఆయన మనవడు సినిమా అనగానే రాకుండా ఉండలేకపోయా. వాళ్ల నాన్న విజయ్‌లా సంజయ్‌ కూడా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. ఈ సినిమా సందీప్‌కిషన్‌కి బ్లాక్‌బస్టర్‌గా నిలవాలి అని ఆకాంక్షించారు.

జేసన్‌ సంజయ్‌ మాట్లాడుతూ ఇది యాక్షన్‌ అడ్వెంచర్‌. కొత్త ఎలిమెంట్స్‌ ఉంటాయి. ట్రెజర్‌ హంట్‌ మూవీ ఇది. సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉంటుంది. నన్ను, నా విజన్‌ని నమ్మినందుకు సందీప్‌కి థ్యాంక్స్‌.ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా అని పేర్కొన్నారు.

మమ్మల్ని నమ్మి ఇంత ఖర్చుపెట్టిన లైకా సంస్థకు కృతజ్ఞతలు. డైరెక్టర్‌గా జేసన్‌ సంజయ్‌ డెబ్యూ మూవీకి నేను హీరో అనగానే నమ్మలేకపోయా. 70 రోజుల్లో అద్భుతంగా సినిమా తీశాడు తను. గోల్డ్‌ స్ఫూన్‌తో పుట్టినా, స్వయంకృషితో ఎదగాలని తపించే 24ఏండ్ల కుర్రాడు తీసిన సినిమా ఇది అని హీరో సందీప్‌కిషన్‌ చెప్పారు. ఇంకా ఫరియా అబ్దుల్లా, చోటా కె.నాయుడు, తమన్‌, మిర్చి సంపత్‌ తదితర చిత్రబృందంతోపాటు నవీన్‌ యర్నేని, లగడపాటి శ్రీధర్‌, ఎస్‌కేఎన్‌, సాయిరాజేశ్‌ తదితరులు కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events