విశాల్ కథానాయకుడిగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన మద గజ రాజా చిత్రం ఇటీవలే సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. వరలక్ష్మి, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న తెలుగులో విడుదల చేయబోతున్నారు. బాల్య మిత్రులందరూ ఓ పెళ్లి వేడుకలో కలుసుకుంటారు. అక్కడ మొదలైన ఓ వివాదం అనుకోని పరిస్థితులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మిత్ర బృందం ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కామెడీ, యాక్షన్ కలబోతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంతానం కామెడీ ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, నిర్మాణం: జెమినీ ఫిలిం సర్క్యూట్, తెలుగు రిలీజ్: సత్యకృష్ణన్ ప్రొడక్షన్.