Skip to main content

Namaste NRI

తెలుగులోకి విశాల్ మద గజ రాజా..రిలీజ్ ఎప్పుడంటే?

విశాల్‌ కథానాయకుడిగా సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన మద గజ రాజా చిత్రం ఇటీవలే సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. వరలక్ష్మి, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న తెలుగులో విడుదల చేయబోతున్నారు. బాల్య మిత్రులందరూ ఓ పెళ్లి వేడుకలో కలుసుకుంటారు. అక్కడ మొదలైన ఓ వివాదం అనుకోని పరిస్థితులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మిత్ర బృందం ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కామెడీ, యాక్షన్‌ కలబోతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంతానం కామెడీ ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, నిర్మాణం: జెమినీ ఫిలిం సర్క్యూట్‌, తెలుగు రిలీజ్‌: సత్యకృష్ణన్‌ ప్రొడక్షన్‌.

Social Share Spread Message

Latest News