డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో కొనసాగి ఉంటే, ఉక్రెయిన్‌తో యుద్ధం జరిగి ఉండేది కాదని రష్యా అధ్యక్షు డు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. 2020 ఎన్నికల్లో తన గెలుపును దొంగిలించారని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పుతిన్ మీడియా మాట్లాడుతూ ఆయనతో నేను ఏకీభవిస్తాను. ఆయన అధ్యక్షుడైతే, 2020లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపును ఆయన నుంచి దొంగిలించి ఉండకపోతే, 2022లో ఉక్రెయిన్‌లో వచ్చిన సంక్షోభం బహుశా ఉండి ఉండకపోవచ్చు అని పుతిన్ చెప్పారు. ట్రంప్ తెలివైనవారు మాత్రమే కాదని, ఆచరణాత్మకంగా ఆలోచించి పని చేయగలిగే వ్యక్తి అని పుతిన్ ప్రశంసించారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపడానికి రష్యా సిద్ధమేనని ప్రకటించారు.