అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. అనంతరం ఆ రెండు సమీపంలోని నదిలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో 67 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వాషింగ్టన్ డీసీ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో అమెరికా ప్రజలకు సంఘీభావంగా నిలుస్తామని ప్రధాని వెల్లడించారు.