తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో జనవరి 11న కెనడా టోరొంటోలోని బ్రాంప్టన్ చింగువాకూసి సెకండరీ స్కూలు ఆడిటోరియంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పన్నెండు వందల మందికి పైగా ప్రవాస తెలుగు వాసులు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొన్నారు. ఈ సంబరాలకు తాకా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు ప్రారంభించగా కోశాదికారి శ్రీ మల్లిఖార్జునా చారి పదిర సభికులను ఆహ్వానించగా, శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల, శ్రీమతి విశారద పదిర, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి అనిత సజ్జ, శ్రీమతి ప్రశాంతి పిన్నమరాజు మరియు శ్రీమతి అశ్విత అన్నపురెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంబమయ్యాయి.
