Namaste NRI

ఉమెన్స్ డే స్పెషల్..  మూవీ లవర్స్‌కు బంపరాఫర్ .. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ

ఆమని, వికాస్‌ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్‌ శంకర్‌, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా నారి. మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని చెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. శశి వంటిపల్లి నిర్మించారు. ఈ సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 7న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఓ బంపర్‌ ఆఫర్‌ అనౌన్స్‌ చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఈ సినిమా చూసే కపుల్స్‌ కోసం టికెట్స్‌ పై వన్‌ ఫ్లస్‌ వన్‌ ఆఫర్‌ ప్రకటించారు. 7, 8వ తేదీల్లోని అన్ని షోస్‌కు ఈ ఆఫర్‌ వర్తించనుంది. అందరూ తమ టికెట్స్‌ సమీపంలోని థియేటర్లలో, బుక్‌ మై షో ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు అని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన కంటెంట్‌, పాటలు సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. సింగర్‌ సునీత పాడిన హవాయి హవాయి హవాయి, రమణ గోగుల పాడిన గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే పాట మిలియన్స్‌ వ్యూస్‌ సాధిస్తూ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అని నిర్మాత శశి వంటిపల్లి అన్నారు.

Social Share Spread Message

Latest News