Skip to main content

Namaste NRI

వెయ్యిమంది డ్యాన్సర్స్ తో సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు సాంగ్ షూటింగ్

సాయిదుర్గతేజ్‌ హీరోగా  నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సంబరాల ఏటిగట్టు.  ఐశ్వర్యలక్ష్మీ కథానాయిక.  రోహిత్‌ కె.పి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన కార్నేజ్‌ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చిందని, లార్జర్‌ దెన్‌ లైఫ్‌ మేనర్‌లో సాయిదుర్గతేజ్‌ పాత్రను దర్శకుడు రోహిత్‌ ప్రజెంట్‌ చేశారని, అంతకు మించి సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇటీవలే రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వంలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. ప్రస్తుతం దినేష్‌ మాస్టర్‌ డాన్స్‌ డైరెక్షన్‌లో ఓ పాటను షూట్‌ చేస్తున్నారు. ఈ పాటలో వెయ్యిమంది డాన్సర్లు కనిపించబోతున్నారు. ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. 125కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సాయికుమార్‌, శ్రీకాంత్‌, అనన్య నాగళ్ల ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రివేల్‌ పళనిస్వామి, సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events