Skip to main content

Namaste NRI

హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు?

హమాస్‌ ఉగ్రవాద సంస్థతో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్‌లను విడిపించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అదే విధంగా, బందీలందరినీ విడుదల చేయడంతోపాటు, ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికిగల అవకాశాల గురించి కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. అమెరికన్‌ ప్రెసిడెన్షియల్‌ దౌత్యవేత్త (శరణార్థుల వ్యవహారాలు) ఆడమ్‌ బోహ్లెర్‌ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నాయి. హమాస్‌తో నేరుగా అమెరికా గతంలో చర్చలు జరపలేదు. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా 1997లో ప్రకటించింది.

Social Share Spread Message

Latest News