ఆటోమేషన్ సాయంతో అమెరికా ప్రభుత్వ రోజూవారీ కార్యకలాపాల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్)లో భారత సంతతి కుర్రాడికి చోటు దక్కింది. 22 ఏండ్ల ఆకాశ్ బొబ్బ మస్క్ నేతృత్వంలోని కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ట్రంప్ సర్కారు డోజ్ కోసం ఆరుగురు ఇంజినీర్లను నియమించుకోగా, వారందరి వయసు 19`24 ఏండ్ల మధ్యే. ఆకాశ్ బెర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మేనేజ్మెంట్, ఆంత్రప్రెన్యూర్షిప్, టెక్నాలజీ(ఎంఈటీ) ప్రోగ్రామ్ చేశారు. ఎమటా, వలంటీర్ సంస్థల్లో ఇంటర్న్షిప్ చేశారు. బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్ కంపెనీలో ఏఐ, డాటా ఎనలిటిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్ విభాగంలో కొంతకాలం పనిచేసినట్టు తెలుస్తున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)